సఫారీలతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ ఓటమిపాలైంది. ముల్లన్ పూర్ లో దక్షిణాఫ్రికా అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 51 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. క్వింటన్ డికాక్ (90) మెరుపు ఇన్నింగ్స్‌కు, ఒట్నీల్ బార్ట్‌మన్ (4/24) అద్భుత బౌలింగ్ తోడవడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. తిలక్ వర్మ (62) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది.
![]()
