టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను సెలక్టర్లు పదేపదే విస్మరించడంపై భారత మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. దేశవాళీ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్న సర్ఫరాజ్‌కు మూడు ఫార్మాట్లలోనూ ఆడే సత్తా ఉందని, అలాంటి ప్రతిభావంతుడిని పక్కన పెట్టడం బాధాకరమని అభిప్రాయపడ్డాడు.
![]()
