శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన ఐదో టీ20 మ్యాచ్లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన ఈ ఉత్కంఠ పోరులో భారత మహిళల జట్టు 15 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ విజయంతో సిరీస్ ను భారత్ 5-0తో ముగించింది. తద్వారా లంకను వైట్ వాష్ చేసింది.
![]()
