టెస్ట్ సిరీస్‌లో ఎదురైన ఘోర పరాభవాన్ని పక్కనపెట్టి, దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌లో సత్తా చాటేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జట్టులోని సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రాంచీలో నెట్ ప్రాక్టీస్ ప్రారంభించారు. టెస్టుల్లో 0-2 తేడాతో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టుకు ఈ ఇద్దరు అనుభవజ్ఞుల రాక కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
ఇద్దరూ కలిసి నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానుల్లో ఇది కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. శుభ్‌మన్ గిల్ (మెడ గాయం), శ్రేయస్ అయ్యర్ (ప్లీహం గాయం) వంటి కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరం కావడంతో కోహ్లీ, రోహిత్‌లపై బాధ్యత మరింత పెరిగింది. జట్టు బ్యాటింగ్ భారాన్ని ఈ అనుభవజ్ఞులే మోయాల్సి ఉంది.
![]()
