తిరువనంతపురం వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్లో రేణుక సింగ్, బ్యాటింగ్లో ఓపెనర్ షఫాలీ వర్మ అద్భుత ప్రదర్శనతో టీమిండియా అలవోకగా గెలుపొందింది. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను మరో రెండు మ్యాచ్ లు మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంది.
![]()