ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ మరికొన్ని గంటల్లో హైదరాబాద్ నగరానికి రానున్నారు.
సాయంత్రం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఒక చారిటీ మ్యాచ్‌లో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు ఉప్పల్, దాని పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11:50 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. పోలీసులు జారీ చేసిన ట్రాఫిక్ అడ్వైజరీ ప్రకారం.. ఫలక్‌నుమా-ఉప్పల్, సికింద్రాబాద్-ఉప్పల్ మార్గాల్లో వాహనాలను మళ్లిస్తున్నారు. తార్నాక నుంచి ఉప్పల్ వైపు వెళ్లే వాహనాలను హబ్సిగూడ క్రాస్‌రోడ్స్ వద్ద నాచారం, చర్లపల్లి వైపు మళ్లిస్తారు. రామాంతపూర్ నుంచి వచ్చే వాహనాలను స్ట్రీట్ నెం.8 వద్ద దారి మళ్లిస్తారు. ఈ మార్గాల్లో ప్రయాణించే వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆర్టీసీ బస్సులు లేదా మెట్రో రైలు వంటి ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.
![]()
