బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో తాను మాట్లాడిన విషయాలు మీకెలా చెబుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ కొద్ది నిమిషాల్లోనే వెళ్లిపోయారు. శాసనసభ ప్రారంభం కాగానే రేవంత్ రెడ్డి, కేసీఆర్ వద్దకు వెళ్లి కరచాలనం చేసి ఆయన క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ సభలో రెండు నిమిషాలు మాత్రమే ఉన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ను అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిశానని తెలిపారు.
![]()
