ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొడతానని హెచ్చరించారు. తనకు వయస్సు ఉందని, ఓపిక ఉందని కేంద్రాన్ని నిలదీస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ(శుక్రవారం) నర్సంపేటలో సీఎం పర్యటించారు. రూ.508 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించారు సీఎం రేవంత్రెడ్డి.
![]()
