చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గ్వాంగ్డాంగ్ రెండు దశాబ్దాల్లోనే అత్యధిక పెట్టుబడులు సాధించిందని తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’లో ఆయన మాట్లాడుతూ, కొత్త రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు. 2047 నాటికి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామని అన్నారు. తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనేది తమ ఆశయమని అన్నారు.
పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల నుంచి ఆలోచనలను, అభిప్రాయాలను స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని, దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతంగా ఉండాలనేది తమ ఆశయమని అన్నారు. లక్ష్యం పెద్దది అయినప్పటికీ కష్టపడితే అసాధ్యమేమీ కాదని అన్నారు. అందరి సహకారంతో లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
![]()
