తెలంగాణలో పదో తరగతి (ఎస్ఎస్సీ) పబ్లిక్ పరీక్షల సందడి శనివారం
నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 5లక్షల 28 వేల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం 2,676 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఏప్రిల్ 16 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా, విద్యార్థులు ఉదయం 8:30 గంటలకల్లా కేంద్రాలకు చేరుకోవాలని సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు సూచించింది. ఆలస్యంగా వచ్చేవారికి ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుందని తెలిపింది. హాల్ టికెట్లను ఇప్పటికే పాఠశాలలకు పంపించామని, అధికారిక వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
![]()
