గోదావరి నీటి వాటాలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గోదావరిపై ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విస్తరణ పనులను అడ్డుకునేందుకు న్యాయపోరాటాన్ని ఉధృతం చేసింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ముంబైలో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
![]()
