ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) సమగ్రాభివృద్ధికి రూ.1000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఆయన ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ ఎదుట జరిగిన సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వర్సిటీ అభివృద్ధికి రూపొందించిన మాస్టర్‌ప్లాన్, డిజైన్లను, విద్యార్థుల సూచనల కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. సమస్యలపై పోరాడే స్వేచ్ఛ విద్యార్థులకు ఎప్పుడూ ఉంటుందని, అయితే రాజకీయ పార్టీల ఉచ్చులో పడకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని సూచించారు. “కష్టపడి చదువుకొని డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా ఎదగడంతో పాటు, నాయకులై రాష్ట్రాన్ని పాలించాలి” అని ఆయన ఆకాంక్షించారు. తనది ధైర్యం కాదని, ఓయూ విద్యార్థులపై ఉన్న అభిమానంతోనే ఇక్కడికి వచ్చానని తెలిపారు.
![]()
