తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. హైదరాబాద్ నగరంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 10 విమానాలను రద్దు చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా విశాఖపట్నంతో పాటు ముంబై, బెంగళూరు, కోయంబత్తూరు, కోల్‌కతా, కొచ్చి, వారణాసి, ఇండోర్, పాట్నా, గౌహతి వెళ్లవలసిన విమాన సర్వీసులను రద్దు చేస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది.
![]()
