తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర మంత్రివర్గం రెండు కీలక సంక్షేమ బీమా పథకాలకు ఆమోదం తెలిపింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు.
1) సహజ మరణం – రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్
-
60 ఏళ్లలోపు సర్వీసులో ఉన్న ఉద్యోగి సహజ మరణం చెందితే
-
ఇప్పటికే లభించే రెగ్యులర్ ప్రయోజనాలతో పాటు
-
అదనంగా రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ అందించబడుతుంది
-
ఉద్యోగుల నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయరు
2) ప్రమాదవశాత్తు మరణం – కోటి రూపాయలకు పైగా పరిహారం
-
ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో
-
₹1 కోటి కంటే ఎక్కువ పరిహారం ఇచ్చే ప్రత్యేక బీమా పథకం అమలు
-
ఈ పథకానికీ ఉద్యోగులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు
![]()
