“నాకు తెలిసిన, నేను చూసిన హీరో ఒక్కరే.. అది అన్నయ్య చిరంజీవి గారే” అంటూ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. తన అన్నయ్యే తనకు స్ఫూర్తి అని పునరుద్ఘాటించారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర గ్లింప్స్‌ను చూసి అభినందిస్తూ చిరంజీవి, రామ్ చరణ్ చేసిన ట్వీట్లకు ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా జరిగిన చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో పవన్ ప్రసంగించారు.
“ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన, నా గుండెల్లో స్థానం ఉన్న మీ అందరికీ, టీవీలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న తెలుగు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేడుకకు మీ ఆశీస్సులు అందించడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
![]()
