ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, హైదరాబాద్లో నెలకొన్న ‘మెస్సీ మేనియా’ వాతావరణం మధ్య కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం సాయంత్రం నగరానికి చేరుకున్నారు.
శంషాబాద్ విమానాశ్రయానికి విచ్చేసిన రాహుల్ గాంధీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వారు విమానాశ్రయం నుంచి కలిసి బయలుదేరారు.
![]()
