హైదరాబాద్: ‘క్వాంటం సిటీ’గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ‘క్వాంటం టెక్నాలజీ’లో తెలంగాణను గ్లోబల్ లీడర్‌గా మార్చేలా నిపుణులు, పరిశ్రమల భాగస్వామ్యంతో దేశంలోనే తొలిసారిగా ‘లాంగ్ టర్మ్ క్వాంటం స్ర్టాటజీ’ని రూపొందించామన్నారు. గచ్చిబౌలిలోని ఐఐఐటీ- హైదరాబాద్‌లో ‘నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ఫర్ క్వాంటం, తెలంగాణ క్వాంటం స్ర్టాటజీ’ని గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ… అప్పట్లో విద్యుత్, ఇంటర్నెట్ లాంటి ఆవిష్కరణలు ప్రపంచం రూపురేఖలు మార్చాయని, అదే తరహాలో రాబోయే రోజుల్లో క్వాంటం టెక్నాలజీ కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతోందన్నారు. 
![]()
