బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఓ కుటుంబం ప్రజల సొమ్మును దోచుకుందని, ఇప్పుడు ఆ కుటుంబంలో అక్రమ సొమ్ము కోసం గొడవలు జరుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి
అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ లక్ష కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలేశ్వరంగా మారిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు బిడ్డ ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, ఆయన ఎక్కడ పడుకున్నారో ఎవరికీ తెలియదని కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి అన్నారు. ప్రజలను దోచుకున్న వారు బాగుపడినట్లు చరిత్రలో లేదని మండిపడ్డారు. ఈ రోజు నడుస్తున్న చరిత్ర కూడా అదేనని అన్నారు. ఇప్పుడు వారింట్లో జరుగుతోంది పైసల పంచాయితీ తప్ప మరొకటి కాదని అన్నారు.
![]()
