రామ్చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ సినిమా రన్నింగ్టైమ్పై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దని చిత్ర యూనిట్ కోరింది. ఈ సినిమా నిడివి 3 గంటలకు పైగా ఉంటుందని నెట్టింట గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ స్పందించింది. ‘ప్రస్తుతానికి ఫస్టాఫ్ ఎడిటింగ్ మాత్రమే పూర్తయ్యింది. సెకండాఫ్ షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. అలాంటప్పుడు నిడివి గురించి వస్తున్న ప్రచారంలో నిజం లేదు’ అని స్పష్టం చేసింది. సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఎడిటింగ్ టేబుల్ ఉన్నప్పుడు ఇలాంటి పుకార్లను నమ్మొద్దని కోరింది. ![]()
