అడివి శేష్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం
ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో ఈ సినిమా గురించి అడివి శేష్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారనేదానిపై కూడా శేష్ మాట్లాడారు. ‘నాగ చైతన్య వివాహ వేడుకలో అనురాగ్ కశ్యప్‌ను కలిసినప్పుడు ఈ చిత్ర కథను వినిపించాం. కథలోని ఎమోషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆయనకు నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగల్ ఇచ్చారు. దాదాపు 149 రోజుల పాటు ఈ సినిమాకు షూటింగ్ నిర్వహించాం. విడిపోయిన ఇద్దరు ప్రేమికుల జీవితాల చుట్టూ తిరిగే థ్రిల్లింగ్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం రూపొందింది’ అని శేష్ వివరించారు.
![]()
