పారిశ్రామిక రంగం
నూతన శకం ఆవిష్కృతం కానున్నది. ఇందుకు నక్కపల్లి మండలం వేదిక కానుంది. ఉక్కు ఉత్పత్తిలో దిగ్గజ సంస్థలైన ఆర్సెలార్ మిట్టల్- నిప్పన్ స్టీల్ కంపెనీలు సంయుక్తంగా ‘ఏఎం/ఎన్ఎస్ ఇండియా’ పేరుతో భారీ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నాయి. సుమారు లక్షన్నర కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఉక్కు ఫ్యాక్టరీకి సోమవారం సాయంత్రం నక్కపల్లి మండలం పాటిమీద గ్రామం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు
![]()
