ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-19 పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల దృష్టా ఏప్రిల్ 12వరకు మాత్రమే తొలి దఫా షెడ్యూల్‌ను విడుదల చేయగా.. టోర్నీ ప్రారంభానికి రెండ్రోజుల ముందు ఐపిఎల్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) విడుదల చేసింది. దీంతో ఏప్రిల్ 13 నుంచి జరిగే ఐపిఎల్ రెండో దశ మ్యాచ్‌ల షెడ్యూల్ కూడా విడుదలైంది. టోర్నీ ప్రారంభానికి ముందు ఐపిఎల్ కెప్టెన్లతో బిసిసిఐ సమావేశమైంది. ఈ సమావేశంలో క్యాచ్‌ల రివ్యూలపై సుదీర్ఘ చర్చ నడించింది. అలాగే కాంకషన్ సబ్‌స్టిట్యూట్ ఆటగాడిని కొనసాగిం చేందుకు ప్రాంచైజీలు విముఖత చూపడంతో ఈ సీజన్ నుంచి దానిని తొలగించారు.
![]()
