రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయడమే ప్రధాన అజెండాగా రాష్ట్ర మంత్రివర్గం నేడు సమావేశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్లో ఈ భేటీ జరిగింది. మూడు గంటలపాటు వివిధ కీలక అంశాలపై చర్చించిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై మంత్రివర్గం తీర్మానం చేసింది. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్-5ను సవరించాల్సిందిగా తీర్మానం చేసింది. కొత్త రాజధానిగా సీఆర్డీఏ చట్టం పరిధిలోని అమరావతి పేరును చేర్చాలని తీర్మానంలో ప్రస్తావించారు.
![]()
