పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం భారత స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. గత నెల రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో సూచీలు భారీగా పతనమయ్యాయి. ఈ కాలంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ విలువ ఏకంగా రూ. 51 లక్షల కోట్లు హరించుకుపోయింది. సెన్సెక్స్ 9,340 పాయింట్లు (11.5%), నిఫ్టీ 2,850 పాయింట్లు (11.3%) చొప్పున క్షీణించాయి.
ముడి చమురు ధరలు పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం వంటి అంశాలు మార్కెట్ల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. ఫలితంగా సూచీలు వరుసగా ఐదో వారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. 2025 ఆగస్టు తర్వాత మార్కెట్లు ఇంత సుదీర్ఘకాలం నష్టపోవడం ఇదే తొలిసారి.
![]()
