టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ దృష్టి సారించింది. 2027 వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా చేసుకుని, ఈ ఇద్దరి విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సెలెక్టర్లు, జట్టు యాజమాన్యంతో ఓ కీలక సమావేశం నిర్వహించాలని యోచిస్తోంది. దక్షిణాఫ్రికాతో విశాఖపట్నంలో మూడో వన్డే ముగిసిన తర్వాత అహ్మదాబాద్‌లో ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. బీసీసీఐ ఉన్నతాధికారులు, కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇందులో పాల్గొననున్నారు.
ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్న రోహిత్, కోహ్లీలతో వారి భవిష్యత్తు ప్రణాళికలపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదు. “రోహిత్, కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాళ్లకు వారి పాత్ర ఏమిటి, యాజమాన్యం వారి నుంచి ఏం ఆశిస్తోందనే దానిపై స్పష్టతనివ్వడం చాలా ముఖ్యం. వారిని సందిగ్ధతలో ఉంచి ఆడించలేం” అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతానికి ఫిట్నెస్, ప్రదర్శనపైనే దృష్టి పెట్టాలని, అనవసర ఊహాగానాలకు స్పందించవద్దని బీసీసీఐ రోహిత్‌కు సూచించినట్లు తెలిసింది.
![]()
