అమరావతి : రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు శనివారం మీడియాతో సిఎం ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ …. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. రాజధాని రైతులంతా ఒకే గొడుగు కిందకు రావాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులంతా అమరావతి ప్రాంత అభివృద్ధి అసోసియేషన్ కిందకు రావాలని సూచించారు. రాజధాని రైతులంతా జేఏసీగా ఏర్పడితే వారితో సంప్రదిస్తూ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ![]()
