దళపతి విజయ్ నటిస్తున్న ‘జననాయగన్’ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ప్రచార కార్యక్రమాల షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ ఫైనల్ చేసింది. త్వరలోనే సినిమా ట్రైలర్ విడుదల కానుంది. డిసెంబర్ 5, 6 తేదీల్లో సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్లుగా సమాచారం. డిసెంబర్ 27న మలేషియాలో ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించనున్నారు. అదే రోజున గ్రాండ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సినిమా విడుదల విషయానికి వస్తే జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విజయ్ కెరీర్లో ఇదే చివరి సినిమా కావొచ్చన్న ప్రచారం నేపధ్యంలో ‘జననాయగన్’ పై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో సినిమా పేరు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ![]()
