ముస్లింలీగ్ నేత మహ్మదాలీ జిన్నాకు తలొగ్గి.. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వందేమాతర గేయానికి ద్రోహం చేశారని ప్రధాని
ధ్వజమెత్తారు. దానిని ఛిన్నాభిన్నం చేసి.. భారత్‌ను బుజ్జగింపు రాజకీయాల వైపు తీసుకెళ్లారని ఆక్షేపించారు. బంకించంద్ర ఛటర్జీ 1875లో ‘వందేమాతరం’ గేయాన్ని రాశారు. ఇది జరిగి 150 ఏళ్లయిన సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో ప్రధాని ప్రత్యేక చర్చను ప్రారంభించారు. అర్ధరాత్రి 11.42 గంటల వరకు సుదీర్ఘంగా ఇది జరిగింది. పాలక, ప్రతిపక్షాల నడుమ మాటల తూటాలు పేలాయి. 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంతో బ్రిటిష్ సామ్రాజ్యం గడగడలాడిందని.. ఆ తర్వాత వందేమాతర గేయం దానిని సవాల్ చేసిందని.. స్వాతంత్య్ర పోరాటాన్ని ఉర్రూతలూగించి.. స్వాతంత్య్ర సాధన దిశగా జాతీయ సంకల్పానికి ప్రతీకగా నిలిచిందని.. దీనివల్లే దీనిని భారత జాతీయ గీతంగా చేయాలని మహాత్మాగాంధీ అభిలషించారని ఆయన చెప్పారు.
![]()
