దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని, అయితే ప్రణాళికా లోపాల కారణంగా ప్రయాణికులకు కలిగించిన తీవ్ర ఇబ్బందులకు సంస్థను బాధ్యుల్ని చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం లోక్సభలో ఆయన మాట్లాడుతూ, నిబంధనలు పాటించని ఏ ఎయిర్లైన్స్ సంస్థను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సంక్షోభం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఇండిగోకు షోకాజ్ నోటీసులు జారీ చేసిందని, దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని మంత్రి తెలిపారు. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
![]()
