ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ‘ఓట్ల దొంగ.. గద్దె దిగు’ పేరిట భారీ నిరసన సభ నిర్వహించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, సోనియా గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు, వేలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ… కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కైందని తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి.. బీజేపీ కోసం పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. “సత్యానికి, అసత్యానికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో ఎన్నికల సంఘం బీజేపీ వైపు నిలబడింది. బీజేపీ ఎన్నికల సమయంలో రూ.10,000 పంపిణీ చేసినా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు” అని ఆయన విమర్శించారు.
![]()
