ప్రధాని మోడీ జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ మూడు దేశాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 15-16 దేశాల్లో జోర్డాన్, 16-17 తేదీల్లో ఇథియోపియో, 17-18 తేదీల్లో ఒమన్ దేశాల్లో మోడీ పర్యటించనున్నారు. కాగా, జోర్డాన్ – భారత్‌ల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జోర్డాన్ రాజు ఆహ్వానం మేరకు నేడు, రేపు మోడీ ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 ఇబ్న్ అల్ హుస్సేన్‌తో మోడీ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ప్రాంతీయ అభివృద్ధిపై ఇరు నేతలు చర్చించుకోనున్నారు. ![]()
