ప్రముఖ నటి నివేదా థామస్ తన ఫొటోలను కొందరు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రచారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చట్టవిరుద్ధమని, తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని పేర్కొంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.
![]()
