భారత్, న్యూజిలాండ్‌లు ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారత్- న్యూజిలాండ్‌ల మధ్య సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం జరిగిన చర్చలు విజయవంతంగా ముగిశాయి. ఈ మేరకు భారత ప్రధాని మోడీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్లు ఫోన్ సంభాషణల అనంతరం సోమవారం ప్రకటించారు. ఇప్పటికే భారత్ పలు దేశాలతో ఎఫ్‌టిఎ (స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం)ను కుదుర్చుకుంది. గత కొన్ని సంవత్సరాల్లో భారత్ ఒమన్, యుకె, ఇఎఫ్‌టిఎ దేశాలు, యుఎఇ, ఆస్ట్రేలియా, మారిషస్ దేశాలతో వాణిజ్య ఒప్పందాల తర్వాత తాజాగా న్యూజిలాండ్‌తో కుదర్చుకున్నది ఏడవ ఒప్పందం. 
![]()
