టీమిండియా మాజీ కెప్టెన్
నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో తన రిటైర్మెంట్పై షాకింగ్ విషయం చెప్పాడు. 2023 వరల్డ్కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం తర్వాత తాను పూర్తిగా క్రికెట్ నుంచి వైదొలగాలని అనుకున్నట్లు తెలిపాడు. ఈ ఓటమి తనను తీవ్రంగా కుంగదీసినట్లు హిట్మ్యాన్ పేర్కొన్నాడు. ఇక, తనవద్ద ఆడటానికి ఆట ఏమీ మిగలలేదని, పూర్తిగా తప్పుకోవడం బెటర్ అని అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే, ఈ పరాభవం నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టినట్లు తెలిపాడు. ఆ తర్వాత ఆ సంక్లిష్ట సమయాన్ని దాటి మళ్లీ ఆడటం ప్రారంభించానని, 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచామని తెలిపాడు.
![]()
