ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్ ఒక్కటే మార్గం. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీనికి అసలు కారణాలేంటో బాలీవుడ్ అందాల నటి మాధురీ దీక్షిత్ విశ్లేషించారు. విపరీతంగా పెరిగిపోయిన సినిమా టికెట్ల ధరలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల అందుబాటు వంటి అంశాలు ప్రేక్షకులు థియేటర్లకు దూరం కావడానికి ప్రధాన కారణాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆమె ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
![]()
