జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెం, జి.మేడపాడు గ్రామాల మధ్య గోదావరి కాలువ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్వర్క్స్ కేంద్రంలో భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి.
![]()
