దేశవ్యాప్తంగా హెచ్పివి టీకా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం రాజస్థాన్లోని అజ్మేర్లో ప్రధానమంత్రి నరేంద్రమోడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో పాటు, నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం హెచ్పివి టీకా కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 14 సంవత్సరాల బాలికలకు ‘గార్డాసిల్’ అనే టీకాను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ హెచ్పీవీ టైప్ 16, 18తో పాటు టైప్ 6, 11 రకాల నుంచి ఇది రక్షణ కల్పించనున్నట్లు కేంద్రం వివరించింది. 
![]()
