రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు
తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించి, ఆర్థిక అసమానతలను తగ్గించడం తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సోమవారం శాసనసభలో బడ్జెట్‌కు సంబంధించిన సంక్షేమ శాఖల కేటాయింపులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఆర్థిక పరమైన సవాళ్లు ఎదురైనప్పటికీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందని ఆయన అన్నారు. ఆటో డ్రైవర్లు, మత్స్యకారులు, చేనేత కార్మికులు తదితర వృత్తి ఆధారిత వర్గాలకు ప్రత్యేక సంక్షేమ పథకాల ద్వారా మరిన్ని లబ్ధులు అందిస్తున్నామని వివరించారు.
![]()
