రాష్ట్రంలో పోలీస్ సిబ్బంది కొరత అనేది లేకుండా రేషనలైజేషన్ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా ఎస్పిలకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు రెండోరోజైన గురువారం రాత్రి శాంతిభద్రతాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాలు, సున్నితమైన ప్రాంతాలు, సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండే దేవాలయాల వద్ద అవసరమైన మేరకు పోలీస్ సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నేరాల రేటు 6శాతం తగ్గిందని, శాంతిభద్రతలు నియంత్రణలో ఉన్నాయని తెలిపారు . మహిళలపై నేరాలు తగ్గాయని, ఈ నేరాలపై మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మదనపల్లి తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఎస్పిలు కఠినంగా ఉండాలని ఆదేశించారు. మహిళలపై గృహ హింస కేసుల్లోనూ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రౌడీషీట్లను కట్టడి చేయడానికి డ్రోన్లతో నిఘా పెట్టే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
![]()
