పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీనిపై ఆర్టిజిఎస్ అధికారులు, ఎపిఎన్ఆర్టి ప్రతినిధులతో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్షించారు. సౌదీ అరేబియా, దుబారు, ఖతార్, కువైట్ తదితర దేశాల్లోని రాష్ట్ర ప్రజలు ఉద్రిక్తతల కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. ఇందుకోసం కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అక్కడ చిక్కుకుపోయిన వారిని సంప్రదించి, తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సహాయక చర్యల విషయంలో ఎపిఎన్ఆర్టి, ఆర్టిజిఎస్ కలిసి పనిచేయాలని, నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని పేర్కొన్నారు. 
![]()
