జనవరి నుంచి రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులు జరుగుతాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. మండలంలోని వడ్డమానులో రూ 98.7 లక్షలతో నిర్మించిన రోడ్డును మంత్రి సోమవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ … అమరావతి రాజధాని ప్రపంచంలో టాప్ 5 లో ఉండేలా నిర్మిస్తున్నామన్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. 
![]()
