విడుదలకు సిద్ధమైన ‘అఖండ 2’ కూడా భారీ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు విశ్వాసంగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా, సినిమా రిలీజ్‌కు ముందే తెలంగాణ ప్రభుత్వం ఓ వార్త చెప్పింది. రేపటి ప్రీమియర్ల కోసం సినిమా టికెట్ రేట్లను పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం అవుతున్నాయి.
ప్రీమియర్ షోలు : రూ. 600
సింగిల్ స్క్రీన్లు : అ
దనంగా రూ. 50
మల్టీప్లెక్స్‌లు : అదనంగా రూ. 100
ఈ ధరలు మూడు రోజులపాటు మాత్రమే అమల్లో ఉంటాయి.
అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అఖండ 2 కోసం టికెట్ ధరల పెంపుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
స్పెషల్ షో టికెట్ ధరను రూ. 600గా నిర్ణయించింది.
సింగిల్ స్క్రీన్ల్లో రూ. 75 పెంపు,
మల్టీప్లెక్స్‌ల్లో రూ. 100 పెంపును ఆమోదించింది.
డిసెంబర్ 5న చిత్రం విడుదలైన తర్వాత ఏపీలో పెంచిన ఈ టికెట్ ధరలు మొదటి పది రోజుల పాటు కొనసాగుతాయి.
![]()
