శ్రీ శివాజీ బ్యానర్‌పై శివాజీ, లయ జంటగా నటించిన సరికొత్త చిత్రం “సంప్రదాయని సుద్దిని సుద్దపూసని”. ఈ నెల 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ ఆదివారం ఉదయం విశాఖపట్నంలో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో శివాజీ, హీరోయిన్ లయ చిత్ర విశేషాలను పంచుకున్నారు. హీరో శివాజీ మాట్లాడుతూ.. ఇది ఒక విభిన్నమైన డార్క్ కామెడీ చిత్రమని తెలిపారు. “గతంలో లయ-నేను కలిసి చేసిన మూడు సినిమాలను ప్రేక్షకులు ఎలాగైతే ఆదరించారో, ఈ సినిమాను కూడా అలాగే ఆదరించాలని కోరుతున్నాను. సాంకేతిక పరంగా అత్యున్నత ప్రమాణాలు పాటించాం. ముఖ్యంగా సినిమా ఆఖరి 45 నిమిషాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. మాస్టర్ రోహన్ పాత్ర అద్భుతంగా నటించాడు” అని పేర్కొన్నారు. 
![]()
