హారర్ థ్రిల్లర్ సిరీస్ ల పట్ల ఓటీటీ ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక యథార్థ సంఘటనలు ఆధారంగా అంటే ఆ సిరీస్ పై ఇంట్రెస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలా ‘అమెజాన్ ఎం ఎక్స్ ప్లేయర్’కి వచ్చిన ఒక హిందీ వెబ్ సిరీస్ ఇప్పుడు ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఆ సిరీస్ పేరే ‘భయ్: ది గౌరవ్ తివారీ మిస్టరీ’. ఇది పారా నార్మల్ ఇన్వెస్టిగేటర్ గా పేరుపొందిన గౌరవ్ తివారీ జీవితానికి సంబంధించిన కథ. రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించగా, కరణ్ టాకర్ ప్రధానమైన పాత్రను పోషించాడు. 
![]()
