మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నుంచి చిత్రబృందం ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జగపతిబాబు పోషిస్తున్న పాత్రను, ఆయన ఫస్ట్ లుక్ను సోమవారం అధికారికంగా విడుదల చేసింది.
![]()
