నందమూరి
బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని రీతిలో దూసుకుపోతున్నాయి. కేవలం ఆరు గంటల్లోనే ప్రీ-సేల్స్ ద్వారా 1 లక్షా 25 వేల డాలర్లు (సుమారు కోటి రూపాయలకు పైగా) వసూలు చేసి, తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న చిత్రంగా నిలిచింది. ఈ రికార్డు బాలయ్య క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
![]()
