నందమూరి బాలకృష్ణ- మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ అఖండ 2: ది తాండవం విడుదల వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 5
థియేటర్లలో ఆ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ రిలీజ్‌కు కొన్ని గంటల ముందు సినిమా పోస్ట్ పోన్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సోషల్ మీడియాలో ప్రకటించింది. నిజానికి అఖండ 2 ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నట్లు గురువారం సాయంత్రం వార్తలొచ్చాయి. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుతోపాటు ప్రీమియర్ షోలు వేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో అంతా సెట్ అయిందని అనుకున్నారు. కానీ అక్కడికి కాసేపటికే గురువారం రాత్రి ప్లాన్ చేసిన ప్రీమియర్స్‌ను మేకర్స్ రద్దు చేయడంతో మళ్లీ సమస్యలు ఉన్నట్లు వచ్చిన వార్తలకు బలం చేకూరింది.
![]()
