ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజువల్ వండర్ ‘అవతార్’ సిరీస్‌లోని మూడో చి
త్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల నిరీక్షణకు తెరదించుతూ, ఈ చిత్రానికి సంబంధించిన ఐమాక్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనట్లు ట్వంటీయత్ సెంచరీ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. భారతదేశంలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ అద్భుతమైన దృశ్య కావ్యాన్ని తమ మాతృభాషలో ఆస్వాదించే అవకాశం లభించింది.
![]()
