తెలుగు తెరకి వారసులుగా హీరోలు పరిచయం కావడం సాధారణమైన విషయమే. అయితే సీనియర్ హీరోల కూతుళ్లు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వడమనేది ఈ మధ్యనే కాస్త ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇక్కడ తన తొలి సినిమాగా ‘సీతా పయనం’ చేసింది. అర్జున్ ఈ సినిమాకి నిర్మాతగా .. దర్శకుడిగా వ్యవహరించడం విశేషం. అయితే ఈ సినిమా ఫలితం నిరాశపరిచిన విషయం తెలిసిందే.
నిజానికి అర్జున్ కూతురు కోలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టి చాలాకాలమే అయింది. అప్పట్లోనే ఆమె తెలుగులో కూడా చేసి ఉండవలసింది. అయితే ఆమె టాలీవుడ్ వైపుకు రావడంలో చాలా ఆలస్యం చేసింది. నిజానికి ఈ సినిమా కోసం అర్జున్ టాలీవుడ్ లో చాలా వరకూ చుట్టబెట్టారు. ఎంతోమందిని కలుసుకున్నారు. ప్రమోషన్స్ వైపు నుంచి ఈ సినిమాను ఆడియన్స్ కి చేరువగా తీసుకుని వెళ్లడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే అవేవీ ఆశించిన ప్రయోజనాన్ని మాత్రం ఇవ్వలేకపోయాయి.
![]()
