యంగ్ హీరోయిన్ రాశీ సింగ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. కాలేజీ రోజుల్లో తన లెక్చరర్‌తోనే ప్రేమలో పడ్డానని, ఆయనే తన ఫస్ట్ క్రష్ అని ఆమె వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
రాశీ సింగ్ మాట్లాడుతూ, “కాలేజీలో మా లెక్చరర్‌తో ప్రేమలో పడ్డాను. ఆయన చూడటానికి చాలా యంగ్‌గా, అందంగా ఉండేవారు. చదువులో నాకు ఎంతో సహాయం చేసేవారు. వైవా సమయంలో నన్ను ప్రశ్నలు అడిగేవాడు కాదు. రూమ్‌లో సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఆయనే నా ఫస్ట్ లవ్. అయితే మా ప్రేమలో మేం ఎప్పుడూ హద్దులు దాటలేదు” అని తెలిపారు.
![]()
